Header Banner

ఏం చెప్పి భారత్-పాక్ లను బుజ్జగించాడో వెల్లడించిన ట్రంప్! యుద్ధం ఆపితే మీతో..

  Mon May 12, 2025 21:47        Politics

భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ మొట్టమొదట ప్రకటించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ రెండు అణ్వస్త్ర దేశాలను తాను ఎలా ఒప్పించానన్నది ట్రంప్ తాజాగా వెల్లడించారు. వాణిజ్య ఒప్పందాలను ఒక దౌత్య సాధనంగా ఉపయోగించి ఈ ఘర్షణను నివారించగలిగానని ట్రంప్ పేర్కొన్నారు. ఎందుకిలా ఘర్షణ పడతారు... మీతో వాణిజ్యానికి అమెరికా సిద్ధంగా ఉంది... మీరు శాంతించండి... మీతో మేం బోలెడెన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం అని భారత్, పాక్ వర్గాలకు చెప్పామని వివరించారు. "నా పరిపాలన హయాంలో, అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాం" అని ఆయన తెలిపారు. ఆ సమయంలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని, ఇరు దేశాలు భీకరంగా పోరాడుకునే స్థితిలో ఉన్నాయని ట్రంప్ వివరించారు. ఈ సంక్షోభ సమయంలో ఇరు దేశాల నాయకత్వాల గురించి ప్రస్తావిస్తూ, "భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల నాయకత్వాలు శక్తిమంతమైనవి, దృఢంగా నిలబడ్డాయి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని చల్లార్చడానికి వాణిజ్యాన్ని ఒక దౌత్య వ్యూహంగా ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. ఈ జోక్యం ద్వారా లక్షలాది మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న అణు సంఘర్షణను తాము ఆపగలిగామని ట్రంప్ ముగించారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Trump #Tariffs #IndiaModi #Modi #Trumpmeet